గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు సిటిమార్ మూవీ టీం

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు సిటిమార్ మూవీ టీం

*గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో సిటిమార్ మూవీ డైరెక్టర్ సంపత్ నంది సినిమా కబడ్డీ టీం తో కలిసి మొక్కలు నాటారు*

ఈ సందర్భంగా సినీ దర్శకులు సంపత్ నంది మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.రేపు మా సినిమా విడుదల సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలన్న ఉదేశ్యంతో ప్రకృతికి మేలు కలిగేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటామని

ఇదొక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నామని సంపత్ నంది అన్నారు..తెలంగాణ లో అటవీ శాతం 4 శాతం పెరిగిందని అది ఇంకా పెరగాలి అని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణానికి మేలు చేయాలి అని సంపత్ నంది కోరారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ప్రకృతికి మేలు చేసేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి అని ఆర్టిస్టులు హారిక,హాసిని అన్నారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, డీఎఫ్ఓ జోజి ,ఇతర అధికారులు ,కేబీఆర్ పార్క్ సిబ్బంది పాల్గొన్నారు..