సేవకుల్లా సివిల్ సర్వెంట్స్ సర్వీస్ చిరస్మరణీయం

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ పౌరసేవల దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వాలు రూపొందించే విధానాలు, సమర్థవంతమైన అమలులో అధికారుల పాత్ర అత్యంత కీలకం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ సంపూర్ణ సమర్పణభావం, కర్తవ్యనిష్ఠతో చేస్తున్న వీరి కృషి ప్రశంసనీయం.

కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని డాక్టర్లు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులతోపాటు సివిల్ సర్వెంట్లు కూడా ముందుండి నడిపిస్తున్నారు. కరోనాతో పోరాటం మరెంత కాలం అనేది అనిశ్చితమే అయినా.. మన అనుభవజ్ఞులైన అధికారుల సాయంతో ఈ పోరాటంలో విజయం మనదేననే విశ్వాసం నాకుంది.