ఏపీ లోని పలు జిల్లాలల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్

ఏపీ లోని పలు జిల్లాలల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి చిత్తూరు జల్లాకు వెళ్లిన సీఎం అక్కడి నుంచి ఏరియల్ సర్వే షురూ చేశారు. తుపాను కారణంగా దెబ్బతిన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు కడప జిల్లాలోనూ ఏరియల్ సర్వే చేసినట్టు తెలుస్తోంది.కాగా, ఏరియల్ సర్వే అనంతరం చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రేణిగుంట విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, సీఎంతో భేటీ కోసం పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.