CM KCR-గవర్నర్ సమావేశం

CM KCR-గవర్నర్ సమావేశం

హైదరాబాద్ లోని రాజ్ భవనులో ముఖ్యమంత్రి కేసీర్ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిసారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు, వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఎదురవుతోన్న సవాళ్లపై సీఎం కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెల్త్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు.