నిర్లక్ష్యమైతే కనిపిస్తే కాల్చేస్తాం జాగ్రత్త : ముఖ్యమంత్రి కేసీఆర్.

నిర్లక్ష్యమైతే కనిపిస్తే కాల్చేస్తాం జాగ్రత్త : ముఖ్యమంత్రి కేసీఆర్.

లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకపోతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. పోలీసులకు సహకరించకపోతే ఆర్మీని రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు సహకరించకపోతే
24 గంటల కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనావైరస్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 114 మంది కరోనా అనుమానితులు, 19,313 మందిపై నిఘా ఉంచినట్టు తెలిపారు.