అర్ధరాత్రి స్వతంత్రం తెలంగాణలో లిక్కర్ దుకాణాలు ఓపెన్..CM KCR ప్రకటన

నో మాస్క్ నో వైన్ ఆంటోన్న సీఎం కేసీఆర్.

కేంద్రం ఇచ్చిన స‌డ‌లింపువ‌ల్ల మ‌న‌చుట్టు నాలుగు రాష్ట్రాలు లిక్కర్ దుకాణాలు తెరిచాయి. నాలుగు రాష్ట్రాలు తెరిచేవ‌ర‌కు మ‌ద్యం స్మ‌గ్లింగ్ మొద‌ల‌వుతుంది. అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రేప‌టి నుంచి తెలంగాణలో మ‌ద్యం దుకాణాల‌ను తెరుస్తాం.

కంటైన్‌మెంట్ జోన్లో 12 దుకాణాలు మిన‌హా అన్ని చోట్ల తెరుస్తాం. మ‌ద్యం ద‌ర‌లు 16 శాతం పెరుగుతాయి. ప‌బ్‌, బార్ల‌కు అనుమ‌తి లేదు. త‌క్కువ రేటు చీప్ లిక్క‌ర్‌పై 11 శాతం పెంచుతారు. మ‌ళ్ళీ ధ‌ర‌లు త‌గ్గ‌వు. వైన్ షాపులు బౌతిక‌దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. , కొనేవారు భౌతిక ధూరం పాటించాలి. లేకుంటే గంట‌లోపు వైన్ షాప్‌ను సీజ్ చేస్తాం. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వైన్‌షాపులు తెరిచి ఉంటాయి. నో మాస్క్ నో లిక్క‌ర్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి చెబుతున్నారు.

1. ఉదయం 9 నుంచి 6PM వరకు దుకాణాలకు అనుమతి.
2. ఖచ్చితంగా కరోనా మార్గదర్శకాలు అమలు చేయాల్సిందే. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి.
3. మన ఆయుధం లాక్ డౌన్ మాత్రమే.
4. తెలంగాణలో 29 వరకు లాక్ డౌన్ కొనసాగింపు.
5. మ‌ద్యం అమ్మ‌కాల విష‌యంలో 15వ తేదీ వ‌ర‌కు చూస్తాం. ప్ర‌త్యేక రివ్వ్యూ చేస్తాం. దేశంలో వైర‌స్ ప‌రిస్థితి ఎలా ఉంద‌నే దానిపై స‌మీక్షిస్తాం.
6. 27 జిల్లాల్లోని గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌లో మండ‌ల కేంద్రాలనుంచి గ్రామాల వ‌ర‌కు అన్ని షాపులు తెరుచుకోవ‌చ్చు. మున్సిప‌ల్ పరిధిలో 50 శాతం దుకాణాలు తెరుస్తారు. లాట‌రీ ప్ర‌కారం దుకాణాలు తెరుస్తారు.
7. అక్క‌డ భౌతిక దూరం పాటించాలి. దుకాణాలు ఉద‌యం 10 నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంటుంది.
8. రాష్ట్ర‌వ్యాప్తంగా 33 జిల్లాల్లో రాత్రి ఏడు గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది. నిర్మాణ ప‌నులు చేసుకోవ‌చ్చు.
9. యువ, పేద న్యాయవాదులను ఆడుకుంటాము. 25కోట్లు మంజూరు చేసాము.
10. రేపటి నుంచి ఇంటర్ వాల్యువేషన్ చేయబోతున్నాం.