కరోనాపై కట్టడిపై CM కేసీఆర్

కరోనాపై కట్టడిపై CM కేసీఆర్

ప్రగతి భవనులో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడిపై మీడియా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో కరోనాపై సుదీర్ఘంగా చర్చించారు. కరోన వైరస్ సంబంధించి నిన్న కరీంనగర్ జరిగిన ఉదంతం దృష్ట్యా ఇవాళ అన్ని జిల్లాల పోలీస్, కలెక్టర్ లను పిలిచి ఏవిధంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 14 కేసులు నమోదు అయ్యాయి ఇందులో 5 మాత్రమే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు మిగతా వారు అంత ఇతర మార్గాల ద్వారా వచ్చారు. కరీంనగర్ వచ్చిన వారు మత ప్రచారం కోసం వచ్చారు వారిని అందరిని మన డాక్టర్ల ఆధీనంలో ఉన్నారు. చైనా పక్కనే ఉన్న వియత్నాం చైనాలో వచ్చిన తరువాత కట్టడి చేసుకున్నారు కానీ ఇటలీ మాత్రం కట్టడి చేయలేకపోయారు. అయితే ఇవ్వన్నీ అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మార్చి1వ తేదీ నుండి ఇతర దేశాల నుండి వచ్చిన వారు వారికి వారే సరెండర్ కావాలి లేదంటే మా పోలీస్ శాఖ వారిని గుర్తిస్తుంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పోలీస్ అధికారులను నియించారు కాబట్టి ఇబ్బందులు లేవు వారికి వారు వచ్చి జాయిన్ కావాలి. బహిరంగ సమావేశాలు,సభలు,ర్యాలీలకు అనుమతి లేదు, దేవాలయలు,మజీదులు, చర్చిలు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదు. మనుషులను ఎట్టిపరిస్థితుల్లోనూ రానివ్వవద్దు. ఒకే దగ్గర మనుషులు గుంపు కారాదు.
ఈనెల22 తేదీ నాడు ముస్లిం పండుగ ఉంది దాన్ని కూడా
వద్దు అని చెప్పారు. ఉగాది ,శ్రీరామ నవమి వేడుకలు కూడా రద్దు చేశాం వాటిని లైవ్ ద్వారా చూడవచ్చు. పబ్లిక్ సర్వీస్ లలో శానిటైజర్ ఎక్కువగా వాడాలి. గ్రామాల్లో, మండలాల్లో శానిటేషన్ పెంచాలి.


విదేశాలా నుండి వచ్చిన వారిని గుర్తించి హోమ్ క్వారైటైన్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇండ్లలో హోమ్ క్వారయింటైన్ వెళ్తాము అంటే పంపిస్తాం అంతేకాదు వారిపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుంది. విదేశాల నుండి ఎవరు వచ్చిన హోమ్ క్వారయింటైన్ లో ఉంచేలా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేశాం. మనకు చాలా పొరుగు రాష్ట్రలున్నాయి అలాగే రైల్వే కూడా ఎక్కువగా ఉంది.
ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే శాఖతో జాగ్రత్తలపై మాట్లాడాము.
రేపు ముఖ్యమంత్రులతో పీఎం నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఉండబోతోంది. వెంటనే విదేశీ విమానాలు రద్దు చేయాలని కోరుతాము. మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల బార్డర్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనంను చెక్ చేసి అందులో విదేశాల నుండి వచ్చిన వారిని హోమ్ క్వారన్తటైన్ లో ఉంచుతాం. ఇప్పటివరకు మన రాష్ట్రంలో వైరస్ సోకిన వాళ్ళందరు మాత్రం ఇతర దేశాల నుండి వచ్చిన వారు మాత్రమే ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఎక్కువగా శానిటైజ్ చేయాలని ఆదేశించాము. కృత్రిమ కొరతలు సృష్టిస్తే కఠిన చర్యలు, ఎక్కడ కూడా షాప్స్ క్లోజ్ చేయటం లేదు. జనసమూహం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజలకు విజ్ఞప్తి జన సమూహం ఉండకుండా చూడండి. ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనే
శక్తి మనందరికీ ఉంది. అన్ని పెళ్లి మంటపాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ కార్యాలయాలలు యధావిధిగా ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.