లాక్ డౌన్ ఏప్రిల్ 30th వరకు పొడగింపు: CM KCR

తెలంగాణలో లాక్ డౌన్ ఏప్రిల్ ముప్పై వరకు కొనసాగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు క్వారంటయిన్ పూర్తవడంతో ఇప్పుడు ఎవరికి కరోనా లేదని నిర్ధారణ అయింది. తెలంగాణలో 11th రాత్రి పది గంటల వరకు
503 కరోనా కేసులు నమోదవగా 14మంది మృతి చెందారు.
నేటికి 96మంది క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో ఢిల్లీలోని మర్కజ్ కార్యక్రమంకు వెళ్లివచ్చిన వ్యక్తులు 12వందల మందిని క్వారంటైన్ విధానంలో ఉంచడం జరిగింది. 1654మంది క్వారంటైన్ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నారు. ఆస్పత్రుల్లో ఎప్పటికప్పుడు వైద్యులు రిస్క్ తీసుకోకుండా అనుమానం ఉన్న అందరికి కరోనా టెస్టులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ 243 ప్రదేశాలు గుర్తించాము. కంటైన్మెంట్ ఏరియాల్లో ఎవ్వరికి సీరియస్ లేదని వైద్యులు తెలిపారు. ఏప్రిల్ 24 వరకు క్వారంటైన్ కంటైన్మెంట్ బ్యాచ్ మొత్తం పూర్తి చేసుకుంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు. 45లక్షల ఎకరాల్లో పంటలు కోతలకు రావడంతో రైతులతో కలిసి పోవాలని అనిపిస్తోందని మనస్సులో మాట బయట పెట్టారు. కానీ కరోనా కారణంగా వెళ్లటం లేదని నిరుత్సాహంతో తెలిపారు.

దేశంలో కరోనా ఉప్పెన కొత్తగా రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతున్నానని, మహారాష్ట్ర-రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తెలంగాణకు సరిహద్దు ఎక్కువగా ఉంది అందుకే అప్రమత్తంగా సరిహద్దు ప్రజలు ఉండాలని కోరారు. 2020 ఏప్రిల్ 30వ తేదీ తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే దశల వారిగా లాక్ డౌన్ ఎత్తి వేసుకుందామన్నారు. విద్యార్థులకు ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు 1st నుంచి 9 వరకు తర్వాతి క్లాసుకు పంపేందుకు నిర్ణయించగా త్వరలో వీలైతే SSC పరీక్షలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు నీళ్లు పంటలకు ఇవ్వబడుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరిన విషయాన్ని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వారు అక్కడే ఉంటే మంచిదని అప్పుడే కరోనాకు అడ్డుకోగలుగుతామని అన్నారు. అలాగే
ప్రధాని మోడీకి రెండు లేఖలు రాస్తున్నానన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ళ నిధుల విషయంలో వడ్డీ మాఫీ చేయాలని కోరారు. రాష్ట్రాల రెవెన్యూ పడిపోయింది కాబట్టి కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి. గతంలో కూడా ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులు రెండు సార్లు వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేనప్పుడు ప్రత్యేక పద్ధతి అమలు చేయాలి. ప్రపంచ దేశాల మాదిరిగా మన దేశంలో కూడా క్యూఈ ద్వారా నిధులు విడుదల చేయాలి. హెలిక్యాప్టర్ మనీ నిధులు ఇస్తే రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటాయని ప్రధానికి విజ్ఞప్తి చేసారు. PMRF వ్యవస్థకు వర్తించే నిబంధనలు అన్ని CMRFకి వర్తించే విదంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పప్పు చెనగలు వాటా పెంచాలని, రాజకీయాలకు అతీతంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాపై పోరాటం చేయడం సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో పరిస్థితులు దారుణంగా ఉంటే భారతదేశంలో మాత్రం ఇప్పటికి కరోనా కంట్రోల్ స్థాయిలోనే ఉందన్నారు.


2020 ఏప్రిల్ 30వ తేదీ లోపు కరోనా మన భారత సమాజం నుంచి వెళ్లిపోవాలని బలంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదనతో అన్నారు. దయచేసి ప్రజలందరూ ఏప్రిల్ 30వ తేదీ వరకు బయటకు రావొద్దని వేడుకున్నారు. వ్యవసాయ-ఆయిల్-ఫ్లోర్ మీల్స్-ఆహార ఉత్పత్తులు జరిగే పరిశ్రమలు తెరిచే ఉండేందుకు అనుమతి ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో ఇండియాకు అన్నం పెట్టే దేశం ఒక్కటి కూడా లేదని తెలంగాణ ఒక్క రాష్ట్రమే 130 దేశాల కంటే పెద్దదనే విషయాన్ని గుర్తు చేసారు. ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమ-ఫుడ్ సెక్టర్ వ్యవస్థ అనుమతులు ఉంటాయి.
రాష్ట్రాలకు ఉన్న అప్పులను 6 నెలల పాటు వాయిదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఇవ్వాళ్టికి 4వేల కోట్లు ఆదాయం తెలంగాణకు రావాల్సి ఉండేది కాని ఆదాయం లక్షల్లో ఉందని లెక్కలు వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా నిత్యవసర వస్తువులు కల్తీ చేస్తే కఠిన చర్యలు తప్పవని
6వేల 9వందల సెంటర్లలో రైతుల నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.