తెలంగాణ లాక్ డౌన్: CM KCR

తెలంగాణ లాక్ డౌన్: CM KCR

తెలంగాణలో కరోనాపై జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి వచ్చిన స్పందనకు హర్షం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర సర్కూరు పిలుపుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రం అద్భుతంగా ప్రజలు సహకరించారాన్నారు. ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు చప్పట్లు కొట్టి నాతోపాటు
మా కుటుంబ సభ్యులు మంత్రులు, అధికారులు
సంఘీభావం తెలిపాము. నా తరుపున ప్రతి ఒక్క
తెలంగాణ బిడ్డకు అభినందనలు. తెలంగాణలో
ఇవాళ కూడా మరో5 కేసులు కలుపుకుని మొత్తం 26కు
కేసుల సంఖ్య చేరింది. వీళ్ళు అందరూ కూడా ఇతర
దేశాల నుండి వచ్చారు. అందుకే అన్ని అంతర్జాతీయ విమానాలు మార్చి 22 నుంచి నిలిపి వేస్తోంది కేంద్రం.

అలాగే మార్చి 31వరకు తెలంగాణ లాక్‌ డౌన్‌లో
చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రగతిభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రజల అందరి స్పందన, క్రమశిక్షణ ఇలాగే మార్చి
31వరకు ఇంటి దగ్గరే ఉండాలన్నారు. ఎక్కడ కూడా
ఐదుగురికి మించి గుమికూడవద్దని, అందరూ ఇంట్లోనే పరిమితం కావాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రములో ప్రజలకు నిత్యావసరవస్తువుల సరఫరాలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పాలు, కూరగాయలు తీసుకువచ్చేందుకు ఇంటికో ఒక్క వ్యక్తికి మాత్రమే అనుమతివ్వడం జరుగుతుంది. సామాన్య ప్రజల కోసం తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా సర్కారే పంపిణీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. పేదల సరుకుల
కోసం బియ్యంతో పాటు సరుకుల కొనుగోలుకు 1500 నగదు అందజేస్తమన్నారు. అంతేకాకుండా మార్చి 31వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజా రవాణా, ఆటోలు, బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు బంద్‌ ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.