స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సిఎం జగన్మోహన్.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సిఎం జగన్మోహన్.

స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు ప్రజలందరూ చింతించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. కరోనా భయానకం కాదు కేవలం రెండు మూడు వారాల్లో పరిస్థితి మారిపోదు,
నిరంతర ప్రక్రియగా ఏడాది పాటు పోరాడాల్సి ఉంది.
ఓవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే దైనందిన జీవితం
కొంసాగించాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో 200, విజయవాడలో 50 పడకల వార్డులు సిద్ధంగా ఉన్నాయి.

గ్రామ వాలంటీర్లతో ప్రతి ఇల్లు సర్వే చేస్తున్నాం,
విచక్షణ కోల్పోయి ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. కులాలు మతాలకు అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా అంటూనే అధికారులను తప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కలెక్టర్లు అధికారులను బదిలీ చేయటం ఏమి సబబు. అసలు రమేష్ కుమార్ కు ఇలా వ్యవహరించే అధికారం ఎక్కడిది? అధికారం ముఖ్యమంత్రిదా? లేక ఈసీదా?
ఎవరో రాస్తున్నారు, ఎవరో ఆర్డర్ ఇస్తున్నారు, ఆ ఆర్డర్ కాపీలను ఈయన చదువుతున్నారు. ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా? కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రెటరీని పిలిచి ఎందుకు అడగలేదు. చివరకు పేదలకు ఇళ్ల పట్టాల ప్రక్రియను కూడా ఆపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ఓట్లు వేసి 151 స్థానాలు ఇస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇంత వివక్ష చూపటం ధర్మమేనా,
ఇది సరైందేనా? చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్ష చూపడం సరైందేనా? రాష్ట్రాన్ని కూడా ఎన్నికల కమీషనే పాలించవచ్చు కదా? అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహించారు.