మహాభారతంలో కృష్ణుడుగా మహేశ్ నటిస్తే ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు

మహాభారతంలో కృష్ణుడుగా మహేశ్ నటిస్తే ఇలా ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు

కృష్ణుడి గెటప్‌లో మహేశ్ బాబు ఉన్నట్లు ఓ అభిమాని గ్రాఫిక్స్ సాయంతో రూపొందిచిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మహాభారతంలో కృష్ణుడుగా మహేశ్ బాబు నటిస్తే ఆయన‌ ఎలా ఉంటాడో తెలియజేసేలా ఈ ఫొటో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా, సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా పనులు వాయిదా పడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో మహేశ్ బాబుకు ఎంతో క్రేజ్ ఉంది. ఆయనకు ట్విట్టర్‌లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సామాజిక కార్యక్రమాలకు కూడా సాయం చేస్తూ మహేశ్ బాబు చాలా మందికి తోడుగా నిలుస్తున్నాడు.