దేశమంతటా కాంగ్రెస్ పార్టీ కరోనా కసరత్తు

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాలలోని కరోనావైరస్ పరిస్థితిపై సోనియా గాంధీ వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశాన్ని లాక్డౌన్ 3.0ను ఎలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి అలాగే కేంద్రం ఏమి ఆలోచిస్తుందో అందుకు తగిన విధంగా అడుగులు వేస్తూ హస్తం పార్టీ సహాయసహకారాలు అందించాలని ఆమె అభిప్రాయబడ్డారు. మే 17 తర్వాత పరిస్థితులు ఏమిటి? లాక్డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో నిర్ధారించడానికి కేంద్రం ఏ ప్రమాణాలను ఉపయోగిస్తోందని సోనియా గాంధీ పర్యవేక్షించాలన్నారు.

ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాల రైతులకు కృతజ్ఞతలు సోనియా గాంధీ తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో రెండు కమిటీలు ఏర్పాటు చేసాం. ఒకటి లాక్డౌన్ నుండి ఎలా బయటపడాలి, మరొకటి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలి అనే అంశాలపై. దృష్టి పెట్టామని పంజాబ్ సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం డిల్లీలో కూర్చొని, కింది స్థాయిలో ఏమి జరుగుతుందో తెలియకుండా నిర్ణయం తీసుకుంటున్నారని అభిప్రాయపడిన పంజాబ్ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అభిప్రాయబడ్డారు.

కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి ఏ విధంగా బయటపడాలి అనే అంశంపై ఆయా రాష్ట్రాల సీఎంలు కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మన్మోహన్ సింగ్ సూచించారు.