కరోనాపై సోనియా గాంధీ CWC వీడియో కాన్ఫరెన్స్

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనియా గాంధీ సభ్యులతో నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజలను ఆదుకునేందుకు కనీస ఉమ్మడి సహాయ పథకాన్ని ప్రకటించాలి. కరోనా వైరస్ రోగులను నయం చేసేందుకు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని పరికరాలు, కిట్లను అందుబాటులో ఉంచాలి. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాల ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రకటించాలి. పంట కోతలు, కొత్త పంటలు వేసుకునే సమయం కాబట్టి రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని
సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజ్ఞప్తి చేసారు.