వ్యవసాయ రంగం లో చేపట్టవలసిన సంస్కరణల పై సమావేశాన్ని నిర్వహించిన: మోదీ

వ్యవసాయ రంగం యొక్క పరిణామాల పై మరియు వ్యవసాయ రంగం లో చేపట్టవలసిన సంస్కరణల పై సమాలోచించడం కోసం ఒక సమావేశాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న నిర్వహించారు. వ్యవసాయ రంగం లో క్రయ విక్రయాలు, విక్రయించదగిన మిగులు, రైతుల కు సంస్థాగత పరపతి సదుపాయాల లభ్యత, ఇంకా తగినటువంటి చట్టం మద్దతు తో వ్యవసాయ రంగాని కి వివిధ నియమాల బారి నుండి స్వతంత్రాన్ని ప్రసాదించడం వంటి విషయాల లో సంస్కరణ ల పట్ల ఈ సమావేశం లో ప్రత్యేకం గా ఉద్ఘాటించడమైంది.ఇప్పుడు ఆచరణ లో ఉన్నటువంటి క్రయ విక్రయాల సంబంధిత వ్యవస్థ లో వ్యూహ పరమైన జోక్యాల పై శ్రద్ధ తీసుకోవాలని మరియు త్వరిత గతి న వ్యవసాయ అభివృద్ధి ని దృష్టి లో పెట్టుకొని సముచితమైన సంస్కరణల ను ప్రవేశపెట్టాలని గట్టిగా సంకల్పించడమైంది. వ్యవసాయ రంగం లో ప్రాథమిక సదుపాయాల ను బలోపేతం చేయడం కోసం రాయితీల తో కూడిన పరపతి ని అందించడం, పిఎమ్-కిసాన్ లబ్ధిదారులు గా ఉన్న ప్రతి ఒక్కరి కి కిసాన్ క్రెడిట్ కార్డుల అందజేత కై ప్రత్యేక ప్రచార ఉద్యమాన్ని నిర్వహించడం, వ్యవసాయ ఉత్పత్తుల కు అత్యంత సరి అయిన ప్రతిఫలం రైతు కు దక్కేటందుకు గాను రాష్ట్రాల లోపల మరియు రాష్ట్రాల కు, రాష్ట్రాల కు మధ్య వ్యవసాయం దిగుబడుల యొక్క వ్యాపారాని కి మార్గాల ను సుగమం చేయడం వంటి అంశాలు చర్చల లో చోటు చేసుకొన్న ముఖ్యాంశాల లో భాగం గా ఉన్నాయి. ఇ-కామర్స్ కు రాచబాట ఏర్పడేటట్లు ఇ-ఎన్ఎఎమ్ (e-NAM)ను వేదికల కే ఒక మహా వేదిక గా తీర్చిదిద్దాలి అనేది చర్చ కు వచ్చిన ప్రముఖ అంశాల లో ఒక అంశం అయింది.

వ్యవసాయ ప్రధానమైనటువంటి ఆర్థిక వ్యవస్థ లోకి సాంకేతిక విజ్ఞానం మరియు మూలధనం ప్రవహించగలిగే విధం గా సాగు కు సంబంధించిన క్రొత్త క్రొత్త పద్ధతుల కు మార్గాన్ని సుగమం చేసే ఏకరూప శాసనిక స్వరూపాన్ని దేశం లో అమలు లోకి తెచ్చేందుకు గల అవకాశాల పైన కూడా చర్చ లు జరిగాయి. పంటల లో బయో-టెక్నలాజికల్ డివెలప్ మంట్స్ తాలూకు అనుకూల అంశాలు మరియు అననుకూల అంశాలు లేదా ఉత్పాదకత ను వృద్ధి చేయడం మరియు ఇన్ పుట్ కాస్ట్ స్ లో తగ్గింపు ల వంటి వాటిని గురించి కూడా చర్చించారు. ఆదర్శ భూమి కౌలు చట్టం తాలూకు సవాళ్లు మరియు చిన్న రైతుల మరియు సన్నకారు రైతుల హితాన్ని రక్షించడం ఎలాగన్న అంశాల ను సైతం విస్తృతం గా చర్చించడం జరిగింది. పంట కోత ల అనంతర కాలం లో వ్యవసాయ రంగ సంబంధిత ప్రాథమిక సదుపాయాల ను సమకూర్చడం లో ప్రయివేటు రంగ పెట్టుబడి పెద్ద ఎత్తు న తరలివచ్చేలా ప్రోత్సాహకాల ను ఇవ్వడానికి, మరి అలాగే కమాడిటి డిరివటివ్ మార్కెట్ స్ పైన సైతం ఒక సానుకూల ప్రభావం ప్రసరించడానికి వీలు గా నిత్యావసర వస్తువుల చట్టాన్ని అది వర్తమాన కాలానికి సరిపడేటట్టు రూపొందించడం ఏ విధం గా పొసగగలదనే అంశం కూడా చర్చ కు వచ్చింది.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి ని పెంచేందుకు గాను సరకు వారీ నిర్దిష్ట బోర్డుల ను / కౌన్సిల్ ల ను ఏర్పాటు చేయడం, అగ్రి-క్లస్టర్ లను / కాంట్రాక్ట్ ఫార్మింగ్ ను ప్రోత్సహించడం మరియు బ్రాండ్ ఇండియా ను అభివృద్ధి పరచడం వంటి ఉపాయాలు సమావేశం సాగిన క్రమం లో ప్రస్తావన కు వచ్చాయి.

వ్యవసాయ రంగం లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం అతి ముఖ్యమని, అలా చేస్తే మన రైతుల కు లబ్ధి ని చేకూర్చడం కోసం విలువ తాలూకు మొత్తం గొలుసుకట్టు ను ఛేదించే శక్తి అందివస్తుందన్న భావన వ్యక్తం అయింది. సాంకేతిక విజ్ఞానం తాలూకు మేళ్ల ను కడపటి మైలు వరకు విస్తరించి మరీ ప్రపంచం లోని విలువ సంబంధిత శృంఖలం లో మరింత గా పోటీపడగలిగేటట్టు మన రైతుల ను తీర్చిదిద్దడం జరగాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

వ్యవసాయ ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ లో ఎఫ్ పిఒ ల యొక్క పాత్ర ను మరింత గా బల పరచాలని, వ్యవసాయ రంగ వ్యాపారం లో పారదర్శకత్వాన్ని కొనితేవాలని, రైతుల కు గరిష్ఠ ప్రయోజనాలు అందేటట్టు చూడాలని కూడాను నిర్ణయించడమైంది. మొత్తంమీద- బజారు ను పరిపాలిస్తున్న ప్రస్తుత చట్టాల ను పున:సమీక్షించడం గురించి మరియు రైతుల కు ఎంచుకొనే స్వాతంత్య్రాన్ని ఇవ్వడం గురించి నొక్కిచెప్పడమైంది.