ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

దేశంలో లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టాలని పలు సూచనలతో ప్రధాని నరేంద్ర మోడీకి సోనియా గాంధీ లేఖ రాసారు. కరోనా వైరస్ కట్టడిపై పోరాడటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ విధానాన్ని స్వాగతించారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేము పూర్తిగా మద్దతు ఇస్తాము. ప్రస్తుతం దేశం క్లిష్టమైన, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండడంతో ఐక్యమత్యంగా మనం అందరం కలసిమెలసి పోరాడాలి. వ్యక్తి గత ప్రయోజనాల కంటే మన దేశంపై మానవత్వంతో కర్తవ్యాన్ని నిర్వర్తించడం అవసరం. ఐక్యంగా కరోనా కట్టడికి పూర్తి మద్దతు, సహకారంతో మనం అందరం కలిసి తీవ్రమైన వైరస్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.