మేడ్చల్ జిల్లాలో కరోనా అప్రమత్తత

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మన్సిపల్ కార్పోరేషన్ పెంటారెడ్డి కాలనీలో కరోనా కలకలం రేపుతోంది. దీంతో పోలీసుల పహారాలో పెంటారెడ్డి కాలనీ వెళ్ళిపోయింది. పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న మున్సిపల్ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. స్థానిక వ్యక్తి ఒకరు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమీషనర్ శంకర్, మాజి జడ్పిటిసి మంద సంజీవరెడ్డి, కార్పోరేటర్లు, పోలిసులు మున్సిపల్ సిబ్బంది కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నారు.