తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విరుచుకుపడుతోంది. రోజురోజుకు వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సై సహా 9 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. ఇదే పోలీస్ స్టేషన్‌లో గతంలో 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పోలీస్ స్టేషన్‌లో 9 మంది కానిస్టేబుళ్లు, సీఐ, ఓ మహిళా ఎస్సై కరోనా బారినపడడం ఆందోళన రేకెత్తిస్తోంది.