దేశంలో కరోనా మృతులు ’11’ నమోదు.

దేశంలో కరోనా మృతులు ’11’ నమోదు.

దేశంలో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. తమిళనాడులో 54 ఏళ్ల ఓ వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నప్పటికి అవ్యక్తికి మధుమేహం, సీఓపీడీ, హైపర్‌ టెన్షన్‌ సమస్యలతో బాధపడుతుండడంతో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించడంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌ ధ్రువీకరించారు. ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో పోరాడుతోన్న వ్యక్తులు సంఖ్య 18కి చేరింది. దేశమంతటా 519మంది
కరోనా సోకడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్నారు.