“”Good News”” మెజారిటీ జిల్లాల్లో కరోనా “0” జీరో

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వింజృంభించని జిల్లాలు, ప్రాంతాలు మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం తప్పకుండా ఈ న్యూస్ మొత్తం చివరి వరకు చదవండీ.

మన దేశంలో కోవిడ్-19 గ్రామీణ ప్రాంతాలలో ప్రభావం అంతంత మాత్రమే కానీ జన సామర్ధ్యం ఉన్న మెట్రో సిటీలు, పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా జనాలపై ప్రకోపం చూపుతోంది.

మన భారత దేశంలో 734 జిల్లాలు ఉండగా మెజారిటీ జిల్లాల్లో మహమ్మారి జాడ కనిపించడం లేదు. అంటే జీరో కేసులుగా రికార్డుల్లోకి ఎక్కాయి. దేశంలోని 70కి పైగా జిల్లాల్లో కేవలం
ఒకే ఒక్క కేసు నమోదవగా 148 జిల్లాల పరిధిలో 10 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సిక్కిం, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలిలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో మాత్రం కరోనా వ్యాప్తి పరిమితంగా ఉంది.

1. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఆగ్రా, గౌతమ్‌ బుద్ధ నగర్‌, మీరట్ జిల్లాల్లో నమోదయ్యాయి. UPలో 75 జిల్లాలకు 43 చోట్ల మాత్రమే కరోనా సోకింది.
2. రాజస్థాన్‌ రాష్ట్రంలో రాజధాని జైపూర్ పరిధిలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి.
3. గుజరాత్‌ రాష్ట్రంలో అహ్మదాబాద్‌, వడోదర నగారాల్లోనే 74% కేసులు నమోదయ్యాయి.
4 మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదవగా 83% కరోనా కేసులు ముంబై, పూణే, ఠానే నగరాల్లోన్నాయి.
5. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇండోర్‌, భోపాల్‌ సిటీలు కోవిడ్-19 హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి.
6. బీహార్‌ రాష్ట్రంలో 38 జిల్లాలుండగా కేవలం 11 జిల్లాల్లోనే కరోనా వ్యాపించింది.
7. ఒరిస్సా రాష్ట్రంలో 30లో 9 జిల్లాల్లోనే కరోనా సోకింది.
8. కర్ణాటక రాష్ట్రంలో జన సాంద్రత అత్యధికంగా ఉన్న బెంగళూరు, మైసూరు, బెళగావి, కలబుర్గి, బీదర్‌, దక్షిణ కన్నడ జిల్లాలతో కలుపుకుని 19 జిల్లాలకే పరిమితమైంది.
9. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో 13లో 6 జిల్లాల్లోనే కేసులు నమోదయ్యాయి.
10. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 28లో 5 జిల్లాలకే మహమ్మారి విలయతాండవం చేస్తోంది.


11. ఝార్ఖండ్‌ రాష్ట్రంలో 24లో 5 జిల్లాల్లో మాత్రమే విస్తరించింది.
12. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో 8 జిల్లాలకే కరోనా కాటేసింది.
13. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
14. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌ గ్రామీణము, వనపర్తి, మంచిర్యాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేసులు నమోడవ్వలేదు.
14. తమిళనాడు రాష్ట్రంలో 33 జిల్లాల్లో కేవలం చెన్నై, కోయంబత్తూరులోనే కోవిడ్19 కేసులు నమోదయ్యాయి.
15. కేరళ రాష్ట్రంలో కాసరగోడు, కన్నూరు జిల్లాలతో పాటు మిగిలిన 12 జిల్లాల్లో కలిపి 37% కేసులున్నాయి.
16. సిక్కిం, లక్షద్వీప్‌లలో కరోనా మహమ్మారి కాలు మోపలేదు.
17. నాగల్యాండ్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.
18. త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు కేసులు రికార్డాయ్యాయి.
19. గోవా, పుదుచ్చేరిల్లో ఏడు కరోనా కేసులున్నాయి.
20. కరోనా కేసులు 10 వేలు దాటేయ్యేగా, 350కు పైగా మృతులు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.