కరోనాకు వ్యాక్సిన్, క్లినికల్ ట్రయల్ షురూ

కరోనాకు వ్యాక్సిన్, క్లినికల్ ట్రయల్ షురూ

కరోనా వైరస్ విరుగుడు కోసం ప్రపంచం విశ్వప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్ తో పాటు చైనా, అమెరికా, యూరప్‌ దేశాలు వ్యాక్సిన్‌ తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. శాస్త్రవేత్తలు కరోనా మూలాన్ని కనుక్కొనేందుకు క్లినికల్‌ ట్రయల్స్‌ వరకు వెళ్లింది. వ్యాక్సిన్‌ తయారీ కోసం చైనాలో దాదాపు వెయ్యి మంది శాస్త్రవేత్తలు అనుక్షణం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్‌ సైన్సెస్‌లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నారు. మార్చి16 తొలి ట్రయల్‌ చేయగా 18-60 ఏళ్ల వయస్సున్న 108 మందిని మూడు బృందాలుగా విభజించి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. వీళ్లందరు కూడా ఊహాన్‌ నగరవాసులు. భారతదేశంలో కోవిడ్‌19
అరికట్టేందుకు వ్యాక్సిన్‌ తయారు చేయబోతున్నారు.
ముంబాయిలోని సిప్లా కంపెనీ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా
16వేల 713మంది మృతి చెందారు. 3లక్షల 86వేల
332 మందికి కరోనా వైరస్‌ సోకింది.