”కోవిడ్ కమాండ్” స్పెషల్ పోలీస్ ఫోర్స్

దేశంలో తొలిసారిగా కరోనా కమాండో దళం వచ్చేసింది. ఈ వైరస్ మహామ్మారిని ఎదుర్కోనేందుకు పంజాబ్ పోలీసులు విధులు నిర్వర్తిస్తోన్న కాకీలకు ”కోవిడ్ కమాండో” అని నామకరణం చేసేసారు.

ఈ కమాండో విధులు పరిశీలిస్తే
కరోనా పాజిటివ్ కేసుల వద్దకు తొలిసారిగా చేరుకోవడం, క్వారంటైన్, ఐసోలేషన్, హాస్పిటలైజేషన్ విధులు నిర్వహించడం ఈ యూనిట్ బాధ్యతల్లో భాగంగా మార్గదర్శకాలు, విధులు తయారు చేశారు. పంజాబ్ పోలీసుల్లో ముందుగా మొహాలీ జిల్లాలో కోవిడ్ కమాండ్ యూనిట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 

ఈ కోవిడ్ కమాండ్ విభాగంలో ప్రస్తుతం 19 మందితో ఓ టీంను ఏర్పాటు చేసి జిల్లాలో కరోనా ఎమర్జన్సీ కేసులను ఎదుర్కొనేందుకు వైరస్ యుద్ధ రంగంలోకి అడుగేస్తారు. మొహాలీ SSP కుల్దీప్‌సింగ్ చాహాల్ శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న 19 మంది కానిస్టేబుళ్లు అత్యవసర పరిస్థితుల్లో కరోనా నియంత్రణ విధుల్లో సహాయ సహకారాలు అందించబోతున్నట్టు తెలిపారు. ఈ కమాండో ఫోర్స్ సభ్యులు అందరూ స్వచ్ఛందంగా సేవలు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు.

ఈ కోవిడ్ కమాండో దళానికి వ్యక్తిగత భద్రతా పరికరాల వినియోగంలో శిక్షణ, జిల్లాలో ఎక్కడికైనా 30 నిమిషాల్లో చేరుకోగలిగే సామర్ధ్యంతో ప్రథమ చికిత్సా సాధనాలు అందుబాటులో ఉంటాయని వివరంగా ఓ అధికారిక ప్రకటన పంజాబ్ పోలీసులు విడుదల చేసారు.