కరోనాతో కల్లు/ఆల్కహాల్ కష్టాలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారితో పోరాటం/నివారణలకు కేంద్రం/రాష్ట్రాల ప్రభుత్వాల పోరాటాలు కొనసాగుతున్నాయి. కేంద్రం జనతా కర్ఫ్యూ లాక్ డౌన్ ఏప్రిల్14 వరకు కొనసాగిస్తోంది. ఈ నిబంధనలతో ఇప్పుడు చుక్కుంటే కానీ ముద్ద దిగని మందు బాబుల కష్టాలు వర్ణనాతీతం. నిత్యావసరాలు, అత్యవసర సేవలకు

ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయి సరే మేము ట్యాక్స్ పేయర్స్ మాకథేంటనే ప్రశ్నలు ఆరంభమయ్యాయి. చికెన్, మటన్ ముక్కలున్నాయి
కానీ చుక్క లేదంటే ఎలా? కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సమర్ధవంతగా నిర్వహించడంలో భాగంగా మద్యం షాపులతో పాటు కళ్లు దుకాణాలు కూడా మూత వేసాయి. ఇది మన సమాజానికి మంచి నిర్ణయమే కానీ మత్తుకు అలవాటుపడిన మందు బాబులు మాత్రం అల్లాడి పోతున్నారు. చుక్క, ముక్క అలవాటు ఉన్నోళ్లు ముద్ద మింగలేక/ ఆక్రోశం కక్కలేక పోతున్నారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వింత పరిస్థితులు చూడాల్సి వస్తోంది. ఆల్కహాల్/కల్లు తాగేవాళ్ళు మందు దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్లు/ఆల్కహాల్ కోసం ఆగమాగమైపోతున్నారు. కరోనాతో చావడం ఏమో కానీ ఆల్కహాల్/కల్లు లేకపోతే సచ్చే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. లాక్ డౌన్ మంచిదే కానీ మా మందుబాబులకు మతిపోతుందని ఆవేదన చెందుతున్నారు. మంగళవారంతో ఏడు రోజులు దాటుతుండడంతో మత్తు బానిసలకు కాళ్లు చేతులు ఆడటంలేదు. దీంతో అక్కడక్కడ దేశీదారు కల్లు కోసం క్యూలు కడుతున్నారు. ఆల్కహాల్/కల్లుకు బానిసైన వ్యక్తులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఇళ్లలో కుటుంభ సభ్యులు వాపోతున్నారు. నేటి వరకు తమ వద్ద ఉన్న మందుతో నడిపించినా రాబోయే రోజుల్లో లేకపోతే ఎలా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఓ వైపు ఎమర్జెన్సీ పరిస్థితులు మరోవైపు కష్ట కాలల్లో ఈ మందుబాబుల ఆక్రందనలు. కనీసం ఓ గంటైన ఆల్కహాల్ దుకాణాలు తెరిపిస్తే సామాజిక దూరంతో మాస్కులు వేసుకుని మా పనేదో మేము మందుబాబులం మమ అనేస్తామని మనస్సులో మాట్లాడుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయని మందు బానిసలు కొందరు అభిప్రాయబడుతున్నారు.

కానీ మార్కెట్లో మద్యం/ఆల్కహాల్ దుకాణాలు కేంద్రం/రాష్ట్రాలు బంద్ చేసాయి. ఆల్కహాల్ దొరకకపోవడంపై ఎదురవుతోన్న పరిస్థితులపై తెలంగాణ ఎక్సైజ్ & ప్రొహిబిషన్ శాఖ మంత్రి శ్రీనివాస రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తులకు అనుకోకుండా నిలిపివేస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందుకు మానసిక ప్రశాంతతోనే మీరు ఈ ఆల్కహాల్ సేవించడం మానోచ్చని అంతేకాకుండా ఆందోళన చెందే శాతం తక్కువగా అవుతుందని, కుటుంభ సభ్యులే జాగ్రత్తలు తీసుకుని మందుబాబులను మాటలతో మభ్యపెడుతూ మందుకు దూరం చేయాలన్నారు.

అలాగే ప్రతి రోజు ఉదయం యోగా, ధ్యానం, నడక, వ్యాయామం చేస్తూ కుటుంభ సభ్యులతో మమేకమై సంతోషంగా ఆడుతూ పాడుతూ ముందుకు వెళ్లాలి. ఆల్కహాల్ సేవించాలనే విషయాన్ని మరిచేందుకు మన మానసిక స్థితిని మార్చుకోవాలి. అప్పుడే అలవాటులో మార్పులు వస్తాయి అలవాట్లు మారి పోతాయి. శృతి మించితే మాత్రం వైద్యులను సంప్రదిస్తే చిన్న చిన్న చిట్కాలతో మీకు మందు లేదు/తాగలేదనే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని తెలంగాణ ఎక్సైజ్ & ప్రొహిబిషన్ మంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు.