APలో కరోనా “1000” మార్క్ దాటేసింది…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహామ్మారి కేసులు పెరగకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. కానీ ఢిల్లీ సంఘటన కారణంగా కర్నూల్, గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా రాష్ట్రమంతటా కలుపుకుని 1016 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఏప్రిల్ 25 నాటికి కరోనాతో పోరాడి 171 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహామ్మారి కారణంగా మృత్యువాత పడిన సంఖ్య 31కి చేరింది. నేటికి ఆస్పత్రుల్లో 814మంది చికిత్స పొందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ విభాగం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. శ్రీకాకుళంలో ఇవాళే తొలిసారిగా మూడు కరోనా సోకిన కేసులు నమోదవ్వగా విజయ నగరం జిల్లా మాత్రం ఇప్పటికి కరోనా కేసుల్లో శూన్యంతో రికార్డుల్లో ఉంది.