7 ఖండాల్లో ఓ లక్ష మరణాలా? ఘోరం

అగ్రరాజ్యం USAపై కరోనా మహమ్మారి కన్నెర్ర చేసినట్టుంది. కేవలం అమెరికాలోనే 4,28,895 మందికి వైరస్‌ సోకగా 16,697 ప్రాణాలను మింగేసింది. గురువారం మాత్రమే 1,917 మంది మృత్యువాతపడ్డారు.

కరోనా వైరస్‌ ప్రజల పంచ ప్రాణాలతో పాటు ఆర్థిక స్థితిగతులను కూడా నామరూపాలు లేకుండా చేసేస్తోంది. కేవలం నెలలోపే 16 మిలియన్ల మంది ఉద్యోగ భృతి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఏ దేశంలోనైనా సరే ఉద్దీపన ప్యాకేజీ ప్రభావాలు ఏమాత్రం పని చేయడం లేదు. పర్యాటకం, విమానయానం, మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్, ఎగుమతులు-దిగుమతులు ఒక్కటేంటి అన్ని వ్యాపారాలు అల్లకల్లోలం అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొరల్లో కొట్టుమిట్టాడుతోన్న 16లక్షల్లో (ఏప్రిల్10th) 30% మందికి వైరస్ సోకగా 17% మరణాలూ అగ్రరాజ్యంలోనే సంభవించాయి. వైరస్‌ తీవ్రత అత్యాధునిక నగరం న్యూయార్క్‌ రాష్ట్రంలో రోజుకు వందల్లో మృతి చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య 16లక్షలు (ఏప్రిల్10th) దాటింది. మృతుల సంఖ్య ఒక లక్షకు చేరువవుతోంది.

2020 ఏప్రిల్ 10 నాటికి అమెరికా 16,697, ఇటలీ18,279, స్పెయిన్ 15, 447 ఫ్రాన్స్ 12,210 UK 7,978 భారత్ 9th 5,734 కేసులు ఇలా యూరప్, అమెరికా, ఆసియా అన్ని ఖండాల్లో కలుపుకుని 95,869 మంది మృతులు నమోదయ్యాయి. అంటే దాదాపుగా ఓ లక్షకు మనుషుల మృతుల సంఖ్య చేరువవుతుండటం మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తోంది.