కరోనా నిర్ధారణ పరీక్షల్లో AP రాష్ట్రంకు తిరుగేలేదు

కోవిడ్‌19 నివారణ చర్యలపై సీఎం YS జగన్‌ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కోవిడ్‌19 పరీక్షల్లో కొనసాగుతున్న వేగం ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో 2,224 పరీక్షలు, తమిళనాడులో ప్రతి మిలియన్‌కూ 1929 పరీక్షలు, రాజస్థాన్ రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కూ 1402 పరీక్షలు జరిపారు. APరాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 10,292 పరీక్షలు, నిన్నటి వరకూ 1,25,229 పరీక్షలు చేసిన ఏపీ
24 గంటల్లో 67 పాజిటివ్‌ కేసులు నమోదు, యాక్టివ్‌ కేసులు 1,090 ఉండగా 524 మంది డిశ్చార్జి, మొత్తంగా 1,650 కేసుల్లో 36 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో పాటిజివిటీ కేసుల శాతం 1.32 కాగా, దేశంలో 3.84 శాతం రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు 2 శాతం, దేశంలో 3.27 శాతం, రాష్ట్రంలో పనిచేస్తున్న ల్యాబులు 11 పీరియాడికల్‌గా 3 ల్యాబుల్లో ఫ్యుమిగేషన్‌ చేస్తున్న అధికారులు, 45 కేంద్రాల్లో 345 ట్రూనాట్‌మిషన్లు కూడా పనిచేస్తున్నాయి.

గతంలో 245 ఉండేవి, మరో వంద పెంచారు. 11 ఆర్టీపీసీఆర్‌ ల్యాబుల్లో 22 మెషిన్లు పనిచేస్తున్నాయి. ప్రతి జిల్లాలో కూడా 4 మెషిన్లు ఉంచాలన్నది ప్రభుత్వం ప్రయత్నం రోజువారీ పరీక్షల సామర్థ్యం 6 వేలనుంచి 10వేలకుపైగా పెరిగింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 10,292 పరీక్షలు కుటంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా టెస్టులు పూర్తిచేస్తున్నారు. రెడ్‌జోన్లలో ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితమైన మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటించాలని సీఎం ఆదేశం.

ఇప్పటి వరకు రాష్ట్రంలో వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు 65, యాక్టివ్‌ క్లస్టర్లు 86, డార్మింటరీ క్లస్టర్లు 46, గత 28 రోజులుగా కేసుల్లేని క్లస్టర్లు 50 ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.