కేరళ టాక్సీలలో రవాణా రక్షణ కోసం కరోనా ఫైబర్ గ్లాస్

దేశంలోనే కేరళ రాష్ట్రం కరోన కట్టడిలో రికార్డు నిర్ణయాలు తీసుకుని మహామ్మారిని అరికడుతున్నారు. COVID19 నివారణ చర్యలలో భాగంగా ఎర్నాకుళం జిల్లా పరిపాలన టాక్సీలలో ఫైబర్ గ్లాస్ విభజనను, ప్రయాణీకుల విభాగం నుండి డ్రైవర్ కంపార్ట్మెంట్‌ను వేరు చేస్తూ ఏర్పాట్లు చేసారు. కరోనా కలకలం రేగకుండా ప్రయాణీకులు సురక్షితంగా రవాణా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేరళ కరోనా కట్టడితో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలించింది.