‘మనం సైతం’ కరోనాను తరిమిగొడదాం

‘మనం సైతం’ ప్రత్యేక గీతం! కరోనాను కలిసికట్టుగా తరిమి కొడదాం!! కాదంబరి కిరణ్ సారధ్యంలో మానవ సేవకు మారు పేరుగా మన్ననలందుకుంటున్న ‘మనం సైతం’ క్లిష్టమైన కరోనా కాలంలో తన సేవలను మరింత విస్తృతపరిచింది.

దాతల సహకారంతో.. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే వజ్ర సంకల్పంతో ముందుకు సాగుతోంది. అవసరమైన వారికి ఆహారం అందించడం ఎంత ముఖ్యమో… ఈ మహమ్మారి గురించి అందరికి అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమనే ఆలోచనతో తాజాగా ఒక పాట రూపొందించింది.

“మనం సైతం కరోనాను కలిసి కట్టుగా తరిమి కొడదాం” అంటూ సరళమైన పదాలతో ప్రముఖ రచయిత రాజేంద్రకుమార్ రాసిన ఈ పాటను ఫ్లూట్ నాగరాజ్ స్వరపరిచారు. మీర్ ఎడిటింగ్ చేశారు. ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్, ప్రముఖ దర్శకులు మారుతి, జి.నాగేశ్వర్ రెడ్డి, ప్రముఖ పాత్రికేయులు దేవులపల్లి అమర్, టీవీ5 మూర్తి, దీప్తి బాజపాయ్, జర్నలిస్ట్ సాయి, ప్రముఖ గీత రచయితలు చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్, ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, విష్ణు జగతి, యువ కథానాయకుడు శివ కందుకూరిలతోపాటు ‘మనం సైతం’ టీమ్ ఈ పాటలో ఉత్సాహంగా పాల్గొన్నారు!

ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండి..ఈ పాటను తెరకెక్కించడం విశేషం. ఈ పాట రూపకల్పనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కాదంబరి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు!!