కరోనా కొరివి దెయ్యం వెంటాడుతూనే ఉంటుంది.. WHO

కరోనా కొరివి దెయ్యం నుంచి మృత్యుంజయులుగా కోలుకున్న వ్యక్తులకు మళ్లీ రాదనే (కోవిడ్19 సోకడం) ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. కోవిడ్19 వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని ఇప్పుడే చెప్పలేమని WHO హెచ్చరిస్తోంది. ఇమ్యూనిటీ పాస్‌ పోర్టులు, రిస్క్‌ ఫ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్న వివిధ దేశాల తీరుని WHO తప్పు పట్టింది. చిలీ దేశంలో ఆఫీసులకి వెళ్లడానికి, ప్రయాణాలు చేయడానికి వీలుగా ఇమ్యూనిటీ పాస్‌పోర్టులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించడాన్ని అభ్యంతరం తెలిపింది.