దేశంలో కరోనా ఫ్రీ రాష్ట్రాలు?? మీకు తెలుసా!

యావ‌త్ ప్ర‌పంచాన్ని మ‌హ‌మ్మారి క‌రోనా గ‌డ‌గ‌డలాడిస్తున్న త‌రుణంలో భార‌త్ దేశంలో పలు రాష్ట్రాల్లో అస‌లు క‌రోనా కేసు న‌మోదు కాలేదంటే నమ్ముతారా? అవును Newsbazar9.com చెబుతున్న‌ది నిజ‌మే.

కేంద్ర హోంశాఖ, వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించిన వివ‌రాల‌ ప్ర‌కారం దేశంలోని పలు రాష్ట్రాల్లో క‌రోనా కేసు ఒక్క‌టి కూడా న‌మోదు కాలేదు. కేంద్ర ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్‌ని ప‌క్కాగా అమ‌లు చేసిన ఆ రాష్ట్రాలు, ఈ మేర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాకుండా చ‌ర్యలు తీసుకున్నాయి.

అందులో లక్ష దీప్, నాగాలాండ్, దాద్ర నగర్ & హావేలి, సిక్కిం, డామన్&డయ్యూలున్నాయి. సోమవారం గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఉన్న అరకొర కేసులు కూడా కొలుకోవడంతో కరోనా ఫ్రీ రాష్ట్రాలుగా ఉన్నాయి. త్రిపుర‌, మిజోరాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కేవలం ఒక్కో కేసు మాత్రమే యాక్టివుగా ఉన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పోటాపోటీగా కరోనా కేసులు నమోదవుతుండటం బాధాకరం.