కర్నూలులో కరోనా గ్లాడియేటర్స్

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 12 మందిని నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం డిశ్చార్చ్ చేసాము: కలెక్టర్ జి.వీరపాండియన్.

ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 12 మందిలో 11 మంది పురుషులు, ఒక మహిళ. వీరిలో 60 నుండి 70 ఏళ్ల వృద్ద్యాప్య వయసుతో పాటు బీపీ, షుగర్, సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 4 గురు వృద్ధులు కూడా కరోనాను జయించడం జిల్లా వాసులకు పెద్ద రిలీఫ్ మిగిలిన 8 మంది 35ఏళ్ల వయసు నుండి 50 ఏళ్ల వయసు లోపు ఉన్నారని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 12 మంది కరోనా విజేతల్లో కర్నూలు నగర వాసులు ఒక్కరు, నంద్యాల -8 మంది, ఆత్మకూరు – ఇద్దరు, బనగాని పల్లె – ఒక్కరు. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 126 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్. కలెక్టర్ వీరపాండియన్.

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 12 మంది డిశ్చార్చ్ కావడం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధులు కూడా ఎక్కువ సంఖ్యలో కరోనాను జయించడంతో పాటు ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్చ్ అయిన వారి సంఖ్య 126 కు పెరగడం బిగ్ రిలీఫ్ జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే మనో ధైర్యం నమ్మకం పెరిగింది. కలెక్టర్ వీరపాండియన్

నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి డిశ్చార్చ్ అయిన 12 మంది కరోనా విజేతలను, డాక్టర్లు, అధికారులు, వైద్య సిబ్బందిని అభినందించిన కలెక్టర్ వీరపాండియన్.

డిశ్చార్చ్ ఆయిన 12 మందికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును అందించి ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపిన శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి స్పెషల్ ఆఫీసర్ మరియు ఏపిఐఐసి జోనల్ మేనేజర్ పి.వెంకట నారాయణమ్మ, అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది.

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లి కరోనా బారిన పడి మెరుగైన ప్రభుత్వ వైద్యం సదుపాయాలతో కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా ఆనందంగా కర్నూలు జిల్లా శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లిన 12 మంది.

గత నెలలో జిల్లా కోవిడ్ ఆస్పత్రి శాంతిరామ్ ఐసోలేషన్ వార్డులలో ఆ 12 మందిని అధికారులు, వైద్య సిబ్బంది చేర్పించి ప్రభుత్వ సాయంతో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా కోలుకుని కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం 2 సార్లు రిపీట్ టెస్ట్ లను చేయించుకుని నెగటివ్ ఫలితం రావడంతో ఈ రోజు సాయంత్రం డాక్టర్లు డిశ్చార్జ్ చేసారు.

కరోనా బారిన పడినా తమ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం ప్రభుత్వం తరఫున భరించి.. తమను బాగా చూసుకుని..ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును కూడా ఇచ్చి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, అందరికీ ధన్యవాదాలు తెలిపిన 12 మంది కరోనా విజేతలు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో కరోనా విజేతలుగా నిలిచి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లి అందరిలో ధైర్యాన్ని, స్ఫూర్తి ని నింపిన 126 మంది కరోనా విజేతలు.