కరోనా రాబోవు కాలం

రాబోవు కాలంలో కరోనా వైరస్ తాకిడిని అరికట్టాలి అంటే భౌతిక దూరము పాటించటం, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవటం, మాస్క్ ధరించడం దైనందిక జీవితంలో ఒక భాగం అవ్వ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

దానితోపాటు కరోన లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చినట్లయితే, స్వీయ గృహనిర్బంధం తప్పనిసరి.

ముఖ్యంగా ఆస్తమా, గుండె జబ్బులు, బిపి, షుగర్ ఉన్నవారు, 60 సంవత్సరాలకు పైబడిన వారు స్వీయ గృహనిర్బంధం పాటించాల్సి ఉంటుంది. వీరిలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వారు క్రింద సూచించిన మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది.

సాధ్యమైనంతవరకు వీటిని పాటించి కరోనా బారినుండి తమని తాము రక్షించుకోవడం మే కాకుండా సమాజాన్ని కూడా రక్షించ వలసిన బాధ్యత ఎంతైనా ఉంది.

ఇంట్లో ఉందాం!!!
సురక్షితంగా ఉందాం !!!
కరోనా నీ ఎదుర్కొందాం!!!