కరోనా మృత్యుంజయురాలికి ఘన స్వాగతం

కరోనా మహమ్మారితో 20 రోజులుగా ఐసోలేషన్‌లో పోరాడి తిరిగి ఇంటికి వచ్చిన ఓ మహిళ(34)కు కరత్వాన ధ్వనులతో అపూర్వ స్వాగతం ఇచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో కరోనాపై విజయం సాధించి ఇంటికి చేరుకున్నందుకు శంఖం ఊదుతూ, చప్పట్లు కొడుతూ, ధరువులతో మహిళకు ఘన స్వాగతం పలికారు. మార్చి తొలివారంలో ఫిన్‌ల్యాండ్‌లోని నార్తర్న్‌ లైట్స్‌కి విహారయాత్రకు వెళ్లాను. కరోనా మహమ్మారి లక్షణాలు కనిపించడంతో వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించగా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌
వచ్చిందని తేలింది. ఆ తర్వాత డాక్టర్లు, నర్సులు ఇచ్చిన మనోధైర్యం నా వ్యాధి తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడిందని’ ఆ మహిళ తెలిపారు.