కరోనా మొబైల్ యాప్ రాబోతోంది..

క్వారంటైన్‌ను వ్యక్తుల కదలికలపై నిఘా
GPSతో పర్యవేక్షణకు పోలీసుల ప్రయత్నం
చుట్టుపక్కల ప్రజలకు అలర్ట్‌ సమాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌ యంత్రాంగం కరోనా మొబైల్ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ముఖ్యంగా విదేశాలు,
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనుమానితులను క్వారంటైన్‌ చేస్తున్నప్పటికీ ఇళ్ళు, ఆసుపత్రుల్లో ఉండకుండా బయటకు వెళ్తున్నారు. దీంతో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో కట్టడి చేయడానికి కరోనా యాప్‌ను తయారు చేస్తున్నామని గుంటూరు ఐజీ ప్రభాకరరావు తెలిపారు.

కరోనా భాదితులు, అనుమానితులు అందర్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని GPSతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. క్వారంటైన్‌ పరిధి దాటి సంచరిస్తే వెంటనే అలర్ట్ సమాచారం పోలీసులకు వెళ్తుంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల సమాచారం ఇవ్వకుండా ఉంటే వైద్య పరిరక్షణలో భాగంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తులపై ఐపీసీ 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయని ఐజీ ప్రభాకరరావు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విధానం విజయవంతం ఐతే భారతదేశం అంతటా అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.