క‌రోనా వైర‌స్ ఔషధం లేని ఓ ప్ర‌శ్న‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా రాత్రింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్న శాస్త్ర‌వేత్త‌ల‌కు కరోసా వైర‌స్ నాడి అంతుచిక్క‌డం లేదు. ఈ వైర‌స్‌కు సంబంధించి అనేక‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు పరిశోధ‌న‌లోనే ఉన్నాయి. క‌రోనా వైర‌స్ ఎంత మందికి వ్యాపించి ఉంటుందంటే స‌మాధానం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో కోవిడ్‌-19 కేసుల‌ను దృవీక‌రిస్తున్నారు. అందులో పాజిటివ్ కేసులు వేల‌ల్లో ఉంటున్నాయి. క‌రోనా బాధితుడి కాంటాక్ట్ వ్య‌క్తుల్లో వైర‌స్ ఉన్న‌ప్ప‌టికీ, ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని కేసులు ఎన్ని ఉంటాయో అంతుప‌ట్ట‌క‌పోవ‌డం అంద‌రిని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

క‌రోనా వైర‌స్ కు సంబంధించి ఖ‌చ్చితంగా కేసులు గుర్తించ‌నంత వ‌ర‌కు మ‌ర‌ణాల రేటును చెప్ప‌డం అసాధ్యం. అయితే క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన వారిలో దాదాపు 1% మంది చ‌నిపోతున్న‌ట్టు మాత్రం గణాంకాలు చెబుతున్నాయి.

జ్వరం, పొడి దగ్గు, బలహీనత, పంచేంద్రియాల్లో ఇబ్బందులు క‌రోనా లక్షణాలు ఇవే. అయితే కొన్ని కేసుల్లో గొంతు పొడిబారడం, తలనొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు కూడా కనిపించాయి. కొందరిలో అయితే వాసన చూసే శక్తి కూడా కోల్పోవడం జరుగుతోంద‌ని ప్ర‌చారంలో ఉంది. కానీ, వారికి స్వల్పంగా జలుబు లాంటి లక్షణాలు, అంటే కొంతమంది రోగుల్లో ఉన్నట్లు ముక్కు కారడం, తుమ్ములు లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయా అనేది చూడడం చాలా ముఖ్యం..
క‌రోనా వైర‌స్ ను పిల్ల‌లు వేగంగా వ్యాపించేలా చేస్తారు.
దీనికి కార‌ణం పిల్లలు ఎక్కువ మందితో క‌లిసి పోతుంటారు. కరోనా వైరస్ ఖచ్చితంగా పిల్లల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా వయసుల వారితో పోలిస్తే, ఈ వైరస్‌తో చనిపోయిన పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉన్న‌ట్టు స‌మాచారం. ప్రపంచంలోనే క‌రోనా వైర‌స్ ఔషధం లేని ఓ ప్ర‌శ్న‌లా ఉంది అందుకే ప్రజల్లారా మనకు మనకే రక్షకులం. స్వీయ నియంత్రణ అవసరం. జాగ్రత్తగా ఇంట్లో ఉండండి రెండు గంటలకు ఓసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సరేనా మిత్రమా మరవొద్దు.