కరోనా శాస్త్రవేత్తల మాటల్లో మీ కోసం

దేశంలో ఎటు చూసినా ఏ నోట విన్న క‌రోనా వైర‌స్ మాటే. తుమ్మిన‌, ద‌గ్గినా ఒళ్లు ద‌ద్ద‌రిల్లుతోంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు ముఖ్య‌మైన స‌మాచారాన్ని జాన్స్ హాప్కిన్స్ విశ్వ‌విద్యాల‌యం వెల్ల‌డించింది.

అస‌లు క‌రోనా వైర‌స్ అంటే ఏమిటీ, ఆ వైర‌స్ మ‌న‌కు సంక్ర‌మించ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విష‌యాల‌పై స‌వివ‌రంగా తెలియ‌జేసింది. అన్ని వైరస్‌ల్లాగే కరోనా వైరస్ కూడా జీవం లేని పదార్థం. ఇందులో ఓ ప్రోటీన్ అణువు ఉండగా, పరిమాణం కనురెప్ప వెంట్రుక మందంలో 1000వ వంతు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కళ్లు, ముక్కు, నోటిలో నుంచి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేరుకుపోయిన కణాల జన్యుక్రమాన్ని ప్రమాదకర కణాలుగా మార్చుతుంది. ఈ కణాలు అలాంటి కణాలను పుట్టిస్తాయి.

కోవిడ్‌-19, ఫ్లూ ల‌క్ష‌ణాలు ఒకేలా ఉంటాయ‌ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేసిన తాజా పరిశోధనలో తేలింది. ఈ రెండు వైర‌స్‌లు కూడా చ‌లికాలంలోనే వ్యాప్తి చెందుతాయి. అయితే ఫ్లూ పై ప్ర‌జ‌ల్లో కొంత నిరోధకత‌ పెరిగిన‌ప్ప‌టికీ, కోవిడ్‌-19 విష‌యంలో ఆ ప‌రిస్థితి లేదు. క‌రోనా కొత్త వైర‌స్‌. ఈ వైర‌స్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోడానికి మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేతంగా లేదు. అందుకే క‌రోనా వైర‌స్ వాయువేగంతో విస్త‌రిస్తూ జ‌నాల‌ను బ‌ల‌హీనం చేస్తూ మృత్యుఒడిలోకి తీసుకెళ్తోంది. త్వరగా పరివర్తనం చెందుతూ ప్ర‌మాద‌కారిగా మారిన క‌రోనా వైరస్‌కు వ్యాక్సిన్ త‌యారీకి జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ త‌యారీకి సమయం ప‌ట్ట‌వ‌చ్చు. కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించడమే ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.