కరోనా సినిమా “నా కళ్ళద్దాలు”

‘నా కళ్ళద్దాలు’ అనే ఈ నా ‘Corona Awareness Short Film’ మనిషి మనుగడకీ, దేశ క్షేమానికీ ఉద్దేశించినది కాబట్టి- దీన్ని ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ మందికి చేరవేస్తే అంత ఉపయోగం ఉంటుంది! కనుక- ఈ నా చిన్ని చిత్రాన్ని టీవీ, రేడియో, సోషల్ మీడియాల్లాంటి ఏ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ మాధ్యమాల్లోనైనా- యధాతధంగాగాని, తర్జుమా చేసిగాని- పూర్తిగా గాని, కొన్నికొన్ని భాగాలుగా గాని, ఎన్నిసార్లైనా గాని- ఉపయోగించడం నాకు ఆనందమేననీ, అందుకు ఎవరైనా దీనిని నా సమ్మతిపత్రంగా భావించవచ్చుననీ- హామీ ఇస్తున్నాను.