కోలీవుడ్ లో కరోనా సినిమా త్వరలో

ప్రపంచాన్నే వణికిస్తోన్న మహామ్మారి కరోనా వైరస్ అంశంపై కోలీవుడ్‌ ఇండస్ట్రీలో త్వరలో ’21 డేస్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. మన దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వైరస్ ప్రభావం, పోలీసు, మున్సిపల్ సిద్దంది అలాగే వైద్యుల సేవలపై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది. MBR FILMS ఎం. విజయ్‌ భాస్కర్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుంది.