క‌రోనా పాజిటివ్‌‌.. పార్ల‌మెంట్‌లో రెండు అంత‌స్తులు సీజ్‌

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్‌లో ప‌నిచేస్తున్న ఓ డైర‌క్ట‌ర్‌కు క‌రోనా పాజిటివ్ తేలింది. దీంతో పార్ల‌మెంట్ బిల్డింగ్‌లోని రెండు అంత‌స్తుల‌ను సీజ్ చేశారు. ఆఫీస‌ర్‌తో పాటు ఆయ‌న భార్య‌, పిల్ల‌ల‌కు కూడా క‌రోనా పాజిటివ్ సోకిన‌ట్లు తేలింది. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్ హౌజ్‌లోని ఫ‌స్ట్ ఫ్లోర్‌ను శానిటైజ్ చేసి సీల్ చేశారు.

అయితే ఆ ఆఫీస‌ర్‌తో ట‌చ్‌లోకి వ‌చ్చిన ప్ర‌తి ఒక అధికారి, వ్య‌క్తిగ‌త సిబ్బంది కూడా త‌మ ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోవాల‌ని అధికారులు ఆదేశించారు. మ‌రోవైపు గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 7466 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.