కరోనాపై రైల్వేశాఖ ఐసోలేషన్ ప్రణాళిక

కరోనా సంక్షోభ సమయాన్ని పాలు పంచుకుకోవటాని భారతీయ రైల్వే శాఖ సిద్దమైంది. కరోనా మహామ్మారిని అరికట్టడానికి కూడా తన వంతు సాయం అందించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. దేశంలో వివిద ప్రాంతాల్లో 20 వేల రైల్వే కోచ్‌లను కరోనా బాధితుల కోసం సిద్దం చేశామని రైల్వేశాఖ పత్రికా ప్రకటన మంగళవారం విడుదల చేసింది. ఈ 20 వేల కోచ్ ల ద్వారా 3.2 లక్షల ఐసోలేషన్ పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కోన్నది. బోగిలోని ప్రతీ క్యాబిన్ ను ఒక రోగికి వసతి కల్పించేలా ఐసోలేషన్ వార్డుగా మార్చామని తెలిపారు. బోగిలు అన్ని సదుపాయాలకు వీలుగా వీటిని రూపొందించామని తెలిపింది. అలాగే పడకల మధ్య రెండు అడుగుల దూరాన్ని ఉంచడం కోసం మిడిల్ బెర్తులను తొలగించామని సంస్థ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐదు జోనల్ రైల్వేలు క్వారంటైన్ ఐసోలేషన్ కోచ్ లతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. 5 వేల బోగీలను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చే పని ఇప్పటికే ప్రారంభమైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి ద్వారా మరో 80వేల పడకలు సిద్ధం కానున్నాయని తెలిపింది. రైల్వే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, ఆయుష్మాన్ భారత్‌తో చర్చలు జరుపుతున్నామని