క‌రోనా కంట్రోల్ ఉన్న‌ట్టే

క‌రోనా కంట్రోల్ ఉన్న‌ట్టే

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 106.31 కోట్ల డోసులను అందించారు. గత 24 గంటల్లో 12,514 కొత్త కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.20% కు చేరింది. గత 24 గంటల్లో 12,718 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,36,68,560 కు పెరిగింది. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.46% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి. దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,58,817. ఇది 248 రోజుల కనిష్ట స్థాయి. రోజువారీ పాజిటివిటీ రేటు (1.42%) గత 28 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది. వారపు పాజిటివిటీ రేటు (1.17%) గత 38 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది. ఇప్పటివరకు 60.92 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.