క్వీన్ ఎలిజిబిత్ కరోనా ప్రసంగం

THE GREAT BRITAN రవి అస్తమించని సామ్రాజ్యం ప్రపంచాన్నే ఏలిన దేశం ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ అత్యవసర ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని UK ప్రజలను అప్రమత్తం చేసేందుకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 5న‌ కరోనాపై ఒరకట చేసేందుకు రాణి ఎలిజిబిత్ మన ముందుకు వస్తారని రాజ కుటుంబం ఓ అధికార ప్రకటన విడుదల చేసింది. లండన్ స్థానిక కాలమానం ప్రకారం క్వీన్ ఎలిజబెత్ ఆదివారం రాత్రి 8గంటలకు ప్రసంగించబోతున్నారు. సాక్షాత్తు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ కరోనా సోకడంతో స్వచ్చందంగా గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఏప్రిల్ 4వరకు UKలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా 38, 175మందికి సోకగా 3,605మంది మృత్యువాత పడ్డారు.