కరోనా కట్టడికి సాయ్ కేంద్రాలు

కరోనా కట్టడికి సాయ్ కేంద్రాలు

కోవిడ్‌ 19 వైరస్ ప్రభావంతో భారత్‌ దేశంలో క్రీడాకార్యకలాపాలన్నీ మూతపడ్డాయి. క్రీడా శిబిరాల్లేవు, పోటీల్లేవు. అందుకే భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రాలకు తాళాలు వేశారు. ఈ కేంద్రాలను కరోనా అనుమానిత, బాధిత కేసులకు క్వారంటైన్లుగా (నిర్బంధ వసతులు) ఉపయోగించేలా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ‘సాయ్‌’ రీజినల్‌ సెంటర్లు, స్టేడియాలు, హాస్టళ్లను క్వారంటైన్లుగా మార్చేందుకు కేంద్ర క్రీడా శాఖ కసరత్తు చేస్తోంది.