కరోనా గుణపాఠాలు నేర్పింది.. PM మోదీ

దేశంలో పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచు‌లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మనమందరం కలిసి కట్టుగా కరోనా కట్టడికి కృషి చేయాలని, కరోనా నివారణకు మెరుగైన సేవలు అందిస్తోన్న సర్పంచులకు అభినందనలు తెలిపారు.

పంచాయితీలలో 24/7 విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని పీఎం మోదీ ఏ సందర్భంగా సూచించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అందుకే గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీ రాజ్‌
శాఖ ముందుండాలని అభిప్రాయబడ్డారు. గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యంలో మనమంత బలంగా దూసుకెళ్లగలమన్నారు.

దేశంలో లక్షా 25వేల పంచాయతీల్లో బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు అందుబాటులొన్నాయి. కరోనా మహామ్మారి ఆపత్కాల సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని విజ్ఞప్తి చేసారు.

పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.