తెలంగాణలో కరోనా ఖతం చేసేందుకు కౌంటర్లు..

తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కరోనా మహామ్మారి వైరస్ నమూనాలను సేకరించడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల్లో అనుమానం ఉన్న వ్యక్తులు ఈ కరోనా పరీక్షలు చేయుంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశమంతటా కరోనా మహామ్మారి విస్తరిస్తుండటం కారణంగా కోవిడ్19 పరీక్షలు అందరికి నిర్వహించేందుకు చర్యలు చకచక జరుగుతున్నాయి. కానీ కరోనా కంట్రోల్ మాత్రం అవుతుందా లేదానేది కాలమే సమాధానం చెబుతుంది.