పెళ్లి కూతురికి కరోనా, అయినా పెళ్లి వాయిదా వేయని వైనం

పెళ్లి కూతురికి కరోనా, అయినా పెళ్లి వాయిదా వేయని వైనం

కరోనా వైరస్ కారణంగా సమాజంలో ఎన్నో పరిస్థితులు మారిపోతున్నాయి. కరోనా సోకకుండా ఉండేందుకు చాలా మంది తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. భౌతిక దూరం పాటించే క్రమంలో ఎన్నో ఇబ్బందులకూ గురవుతున్నారు. పెళ్లిళ్లకు వెళ్లే వారు కరోనా సోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. పెళ్లికొడుకు లేక పెళ్లి కూతురికి కరోనా వస్తే పెళ్లి వాయిదా వేయాల్సిందే. అయితే, రాజస్థాన్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా పీపీఈ కిట్లు ధరించి వధువు మెడలో తాళి కట్టాడు పెళ్లి కొడుకు. వధువుకు కరోనా సోకిందని సరిగ్గా పెళ్లి రోజున తెలియడంతో పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక పెళ్లి కొడుకు ఈ పనిచేశాడు. రాజస్థాన్‌ షాబాద్‌ జిల్లాలోని బారాలో కరోనా చికిత్స కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పురోహితుడు కూడా పీపీఈ కిట్లను ధరించి పెళ్లి జరిపించారు.