కరోనా వైరసిడల్ పూత

కరోనాపై డాక్టర్ అవినాష్ బజాజ్ నేతృత్వంలోని ఫరీదాబాద్‌కు చెందిన రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌సిబి) పరిశోధకుల బృందం కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి వైరుసిడల్ పూతలను రూపొందించడానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది.

ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (టిహెచ్‌ఎస్‌టిఐ) నుండి డాక్టర్ మిలన్ సుర్జిత్, ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ సామ్రాట్ ముఖోపాధ్యాయ్ సహకారంతో ఈ అధ్యయనం జరుగుతోంది. రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌సిబి), యునెస్కో ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం స్థాపించిన సంస్థ.

డాక్టర్ బజాజ్ బృందానికి యాంటీమైక్రోబయల్ అణువుల రూపొందించడంలో నైపుణ్యం ఉంది, ఇవి సూక్ష్మజీవుల పొరలను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇక్కడ, ఈ బృందం కోవిడ్ -19 వైరల్ కణాల పొరల లక్ష్యంగా అణువులను అభివృద్ధి చేయడంలో వారి నైపుణ్యాన్ని మరింత విస్తృత పరుస్తోంది. ఈ అణువులు గాజు, ప్లాస్టిక్, కాటన్, నైలాన్, పాలిస్టర్‌తో సహా వివిధ ఉపరితలాల కి అనుగుణంగా వ్యాధి వ్యాప్తిని నిరోధించే వైరసిడల్ పూతను అందించడానికి వినియోగిస్తారు.

మహమ్మారిపై పోరాడటానికి సహాయపడే మరొక ప్రయత్నంలో భాగంగా, కేంద్రంలో ప్రొఫెసర్ దీపక్ టి. నాయర్ నేతృత్వంలోని ఒక పరిశోధనా బృందం,ఎన్ఎస్పి 12అనే ప్రోటీన్ చలనశీలతను ఎలా నిరోధించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది, సార్స్ సిఓవి-2 వైరస్ కి చెందిన ఆర్ఎన్ఎ జన్యువు పునరుత్పత్తికి కారణమైన ఆర్‌ఎన్‌ఎపై ఆధారపడ్డ ఆర్‌ఎన్‌ఎ పాలిమరేస్ చలనశీలతను దిగ్బంధిస్తుంది.

ఈ బృందం ఎన్ఎస్పి12 ప్రోటీన్ త్రిమితీయ నిర్మాణం సమాజతత్వ (హోమోలజీ) నమూనాను అభివృద్ధి చేయడానికి గణన సాధనాలను ఉపయోగించింది. ఆ నమూనా ఎన్ఎస్పి12 ప్రోటీన్ నిరోధకాలను గుర్తించడానికి ఉపయోగపడింది. విటమిన్-బి12 మిథైల్కోబాలమిన్ రూపం, ఎన్ఎస్పి 12 ప్రోటీన్ క్రియాశీల ప్రాంతాన్ని బంధించి దాని కార్యకలాపాలను నిరోధిస్తుందని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరికల్పనను ధృవీకరించడానికి బృందం ఇప్పుడు మరిన్ని ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. సమర్థవంతంగా పనిచేసినట్టు వెల్లడైతే, మిథైల్కోబాలమిన్ వెంటనే వినియోగంలోకి తచ్చె అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటికే అనేక ఔషధాల మిశ్రమాల్లో ఒకటిగా ఉంది.

ప్రోటీన్ కి సంబంధించి విభిన్న నిరోధకాలను గుర్తించడానికి ఉపయోగపడే అధిక నిర్గమాంశ ప్లేట్ పరీక్షలను అభివృద్ధి చేయడానికి ఎన్ఎస్పి 12 ప్రోటీన్‌ను శుద్ధి చేసే ప్రయత్నాలను కూడా ఈ బృందం ప్రారంభించింది. ఈ నిరోధకాలు సార్స్-సిఓవి-2 వైరస్‌కు వ్యతిరేకంగా వినూత్న ఔషధాల అభివృద్ధికి ప్రధాన అణువులుగా పనిచేస్తాయి.

అంతేకాకుండా, గణన సాధనాలను ఉపయోగించి సార్స్-సిఓవి-2 వైరస్ నుండి మరో రెండు ప్రోటీన్ల నిరోధకాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సార్స్-సిఓవి-2 కి సంబంధించి అందుబాటులో ఉన్న జన్యు శ్రేణులను కూడా విశ్లేషిస్తున్నారు. జన్యువులలో పేరుకుపోయి ఉన్న ప్రాంతాలపై చిన్న అణువులను ప్రయోగించి అవి ప్రతిరూపం దాల్చకుండా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది.