కరోనా పరీక్షలు ఎవరు చేసుకోవాలి??
కరోనా వైరస్ తో ఓవైపు ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలు, వీడియోలు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోన్నాయి. ఇళ్ల పట్టునే ఉన్న కుటుంబసభ్యుల్లో ఎవరైనా తుమ్మినా, దగ్గినా, లేదా ఒళ్లు కాస్తా వేడిగా ఉన్నా అది సాధారణ అనారోగ్యమైనా కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. దీనికి గల కారణం కరోనా వైరస్‌పై సరైనా అవగాహన లేకపోవడమే. కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రజలను చైతన్యం చేసే సందేశాలు మూడు నాలుగు ఉంటే, వారిని మరింత మానసికంగా కుంగదీసే, తీవ్ర ఆందోళనకు గురిచేసే సందేశాలు వందల సంఖ్యలో ఉండడమే.
కరోనా లక్షణాలపై ప్రజల్లో అపోహాలు, అనుమానాలు, సందేహాలతో పాటు తప్పుడు ప్రచారాం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలనే విషయంలో స్పష్టం చేస్తూ సమాచార పత్రాన్ని జారీ చేసింది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ. గడిచిన 14 రోజుల్లో విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన సూచించింది. ఇక కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసినవారు, వారితో తిరిగిన వారు కూడా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసిందిన. వైద్యరంగంలో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరు, అలాగే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ. వీరితో పాటు దీర్ఘకాలంగా, లేదా స్వల్ప కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు తప్పని సరిగా వైద్య పరీక్షలు జరిపించుకోవాలని సమాచార పత్రంలో స్పష్టం చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.