కరోనా గృహ నిర్బంధం అసలేందుకు? తెలుసుకోండి.

కరోనా నిర్బంధం అసలేందుకు? తెలుసుకోండి.

భారతీయులు అందరూ ఖచ్చితంగా పాటించాల్సిన అతి ముఖ్యమైన అంశాలు.
1. కరోనాపై అబద్ధపు ప్రచారాన్ని నమ్మకండి. (Fake News)
2. కేంద్రరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి.
3. కరోనా కట్టడికి 24/7 ఇంటికి పరిమితం అవ్వాలి.
4. కరోనాపై కంగారులొద్దు. అవగాహన, జాగ్రత్తలు అవసరం.
5. నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం, చైనా, ఇటలీ మరణాలు నిదర్శనం.

ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి చెందే విధానాలు
4 దశలుగా విభజించారు. భారతదేశంలో ప్రస్తుతం రెండో దశలో ఎదురయ్యే ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటోంది.
వైరస్‌ వ్యాప్తి మూడో దశలోకి అంటే సామాజిక వ్యాప్తి-కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ప్రవేశించకుండా
ఆపేందుకు మన భారతదేశానికి ఉన్న గడువు
కేవలం 30 రోజులు. కరోనా వైరస్‌ గృహ నిర్బంధం ఎందుకో?
నాలుగు దశలేమిటి? ఏ దశలో వైర్‌సను ఎలా నియంత్రించవచ్చు? ఈ వివరాలన్నీ ఖచ్చితంగా చదవండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే అవగాహన లేని వాళ్లందరికీ సమాచారం అందవేయండి.

1. కరోనా ముందుగా మన దేశంలో ఎలా వచ్చింది?
తొలిదశలో చైనా, ఇటలీ, ఇరాన్‌ తదితర దేశాలకు వెళ్ళొస్తోన్న భారతీయులు, విదేశీయులకుమాత్రమే వైరస్‌ పాజిటివ్‌గా
ఇప్పటి వరకు నమోదైంది. ఆ వివరాల్లోకి వెళ్తే దేశంలోనే తొలి ముగ్గురు కరోనా బాధితులు చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న కేరళవాసులు. అక్కడి నుంచి వచ్చాక వారికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. అలాగే మన హైదరాబాదీయుల్లో ఒకరికి దుబాయ్‌లో ఆ వైరస్‌ బారిన పడి ఇక్కడికి వచ్చారు.
తొలి దశలో బయటపడ్డ కేసులన్నీ ఇలాంటివే. అందుకే కేంద్ర సర్కారు1 అంచెలంచెలుగా ఆంక్షలు విధించి అంతర్జాతీయ విమాన రాకపోకలను పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులు మాత్రమే నడుపుతున్నారు.

2. కరోనా లోకల్ ట్రాన్స్ మిషన్?
రెండో దశలో విదేశాలకు వెళ్లి వచ్చిన భారతీయులు లేదా విదేశీయుల కారణంగా మనదేశంలో నివసిస్తోన్న పౌరులకు సోకడం. అదెలాగంటే విదేశాలు వెళ్లొచ్చిన వ్యక్తులు కుటుంబసభ్యులు, సహోద్యోగులను కలవడం, సమాజంలో సంచరించడంతో వైరస్‌ సోకడం ప్రారంభమవడం. మనదేశంలో ప్రస్తుతం ఈ దశ నడుస్తోంది. అంటే లోకల్ ట్రాన్స్ మిషన్..కరోనా సోకిన వ్యక్తి నుంచి మరొకరికి అలాగే ఇంకొకరికి కొనసాగింపుగా పదులు వందలు వేల సంఖ్యలో కంటికి కనబడకుండా ఈ కరోనా మహామ్మారి మనల్ని మింగేసేందుకు
ముందుకు వెళ్తోంది. అందుకే 24/7గృహా నిర్బంధం, లాక్ డౌన్ చేయడం, అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంచడం జరుగుతోంది.

3. వైరస్ విలయతాండవం?
మూడో దశలో కీలకమైనది అలాగే అత్యంత ప్రమాదకరమైనది. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వాళ్ల కారణంగా ఈ విషయాన్ని గమనించక పోయినా, అవగాహన లేకపోయినా, అసలు వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించపోయిన చుట్టుపక్కల వారికి వైరస్‌ పెద్దఎత్తున వ్యాపిస్తుంది. క్షణాల్లో రోజుల్లో చూస్తూ చూస్తుండగానే వైరస్‌ వేలాది మందికి సోకుతుంది. మరణాల సంఖ్య భారీగా పెరగడం ఎలాగంటే పిట్టలు రాలినట్టు రాలడం జరుగుతోంది. అంటే మనిషి మనుగడకే ప్రమాదం. మన దేశంలోన్న 125కోట్ల జనాభాలో మెజారిటీ ప్రజలకు కరోనా సోకితే కనీసం మనము నయం చేసే ప్రయత్నాలు కూడా చేయలేక చెట్టులెత్తేసే దుస్థితి వస్తుంది. అందుకే నిర్బంధం. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటురోగుల నివారణ చట్టం-1897 ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలపై ఏ కోర్టులోను సవాల్ చేయడానికి వీలు లేదు.

4. ఇటలీ, ఇరాన్ ఉదాహరణలు..
నాలుగో దశలో వైరస్‌ నియంత్రణ సమాజంలో చేయి దాటిపోవడంతో ఇప్పుడు ఇటలీ, ఇరాన్‌ దేశాల మాదిరి ప్రభుత్వకు6, ప్రజలు కరోనా వైరస్ కారణంగా చనిపోతోన్న
వ్యక్తులను చూస్తూ అయ్యో పాపం అనాల్సిందే తప్ప ఎలాంటి సహాయం, ఆరోగ్యం కాపాడే ప్రయత్నాలు చేయలేము. అలా చేసేందుకు ప్రయత్నిస్తే వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా ప్రమాదం. ఈ అత్యంత భయాంకరమైన నాలుగు దశను ఎదుర్కొన్న దేశం చైనా. 4వ దశలోనే చైనీయులకు కరోనా కేసుల సంఖ్య 81వేలు మరణాలు 3270, ఇటలీలో కరోనా కేసులు 59,138 మరణాలు 5,476, USA లో కేసులు
33,546 మరణాలు 419 , స్పెయిన్ కేసులు 28,768
మరణాలు 1,772, ఇరాన్ కేసులు 21,638 మరణాలు1,685,
ఫ్రాన్స్ కేసులు16,018 మరణాలు 674, గ్రేట్ బ్రిటన్ కేసులు 5,683 మరణాలు 281మంది ఈ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందినవి అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు కలిగిన ధవంతమైన దేశాలు కానీ కరోనా వైరస్ కట్టడికి ఆలశ్యంగా స్పందించడం, కఠిన చర్యలు తీసుకోక పోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ రోజుకి కూడా
ఆదుకునే దిక్కుమొక్కు లేక లబోదిబో మంటున్నాయి.
అందుకే అందుకే మన భారతదేశంలో అలాంటి దీన స్థితులు రాకుండా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో విజయవంతంగా ముందుకు వెళ్తోన్న దక్షిణ కొరియా, తైవాన్ లాంటి దేశాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తోంది.
ఇప్పటికైనా భారతీయుల్లారా మేల్కొనండి. మీ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం జాగ్రత్తలు తీసుకుని అవగాహనతో అందరికి తెలియజేయండి.

కరోనా వైరస్‌ వ్యాప్తి మూడు, నాలుగు దశల్లోకి ప్రవేశిస్తే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. మనదేశంలోని 125 కోట్ల జనాభాకు ఆరోగ్య సమస్యలు ఎదురైతే అందుబాటులోన్న వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స చేసేందుకు సరిపోరు. ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్లు నిండిపోతాయి. ప్రతిరోజు వందలు-వేల సంఖ్యలో కొత్తగా వైరస్‌ బారిన పడుతుంటారు మరోవైపు ప్రాణాలు గాలిలో కలుస్తుంటాయి. అందుకే చైనాలో దుర్భర పరిస్థితుల్లో పదిరోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించి
1500 పడకలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అలాగే
అభివృద్ధి చెందిన దేశం ఇటలీ కూడా కరోనాకు చికిత్స చేయడానికి సరిపడా ఆస్పత్రులు సరిపోవడం లేదు.
80ఏళ్లు దాటినవారిని చేర్చుకోకూడదనే దారుణమైన
నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఇటలీ సర్కారు
పడింది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు బడులకు సెలవులు ఇచ్చింది, ప్రయాణాలు పెట్టుకోవద్దని
హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు
వెళ్లొద్దండి వీలైనంత వరకూ 24/7 ఇళ్లల్లోనే
ఉండాలని హెచ్చరించారు.

ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు.
జలుబు, దగ్గు, జ్వరముతో బాధపడేవారంతా కరోనా సోకిందని భయపడాల్సిన పన్లేదు. కానీ ఆ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులు తామే స్వయంగా ఇటీవలి
కాలంలో విదేశాలకు వెళ్లొచ్చినా, విదేశాలకు వెళ్లొచ్చిన వ్యక్తులను కలిసి దగ్గరగా మెలిగినా అనుమానించాల్సిందే. వెంటనే ఆస్పత్రికి వెళ్లాల్సిందే కరోనా టెస్టులు చేయించుకోవాలి. వైద్యపరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా
ముందు జాగ్రత్త చర్యల్లో కనీసం 14 రోజుల పాటు
స్వీయ గృహనిర్బంధంలో ఉండడం సమాజానికి మంచిది. ఎందుకంటే వైరస్‌ సోకిన 14 రోజుల వరకు కొందరిలో లక్షణాలు బయటపడవు. పరీక్షల్లో నెగెటివ్‌ వస్తుంది.
ఆ భరోసాతో వారు బయట తిరిగి మరింత మందికి అంటించే అవకాశాలు ఉన్నాయి. చైనా, ఇటలీల్లో ఇలాంటి ‘తప్పులు కారణంగానే వైరస్‌ విస్తృతంగా వ్యాపించింది.

చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, హ్యాండ్‌ శానిటైజర్ల వంటివి వాడటం వంటివి ముందు నుంచీ అందరూ చెబుతున్నవే. అలాగే పూర్తి జాగ్రత్తల కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.