కరోనా మహామ్మారి అసలు ఫోటోలు మీకోసం

కరోనా మహమ్మారి కరోన వైరస్‌ సంబంధించిన ఫొటోలు మన దేశంలోకి వచ్చేసాయి. పుణెలోని ICMR-NIV శాస్త్రవేత్తలు
ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ సహాయంతో కంటికి కనిపించని సూక్ష్మజీవి ఫొటోలను ప్రజల ముందుంచారు.
30th జనవరి 2020 నాడు నమోదైన తొలి కరోనా కేసుకు సంబంధించి గొంతుకు సోకిన ఇన్‌ఫెక్షన్‌ నుంచి సంగ్రహించారు.
కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన సాంపిల్స్‌లోని జన్యుక్రమం అలాగే చైనాలోని ఉహాన్‌ నగరంలో వచ్చిన
కరోనా వైరస్‌ జన్యుక్రమంతో 99.98% మ్యాచ్ అయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.