కరోనా వైరస్ నిర్ధారణ కిట్ తయారీలో పురోగతి..

క‌రోనా వైర‌స్ రోగ నిర్ధార‌ణ ప‌రిక్ష‌ల కిట్ త‌యారీలో అమెరికా పురోగ‌తిని సాధించింది. నోవ‌ల్ క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హణ‌కు అత్యాధునిక కిట్‌ను త‌యారు చేసింద‌ది అమెరికా హెల్త్ కేర్ సంస్థ అబాట్ లాబోరేట‌రీస్ సంస్థ‌. మాలిక్యూర్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో చిన్న టోస్ట‌ర్ సైజులో ఉండే పోర్ట‌బుల్ టెస్టింగ్ కిట్ ను త‌యారు చేసింది ఆ సంస్థ‌. ఈ టెస్టింగ్ కిట్‌ను ఉప‌యోగించి కేవ‌లం ఐదు నిమిషాల్లో క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ చేయ‌వ‌చ్చ‌ని అబాట్ లాబోరేట‌రీస్ సంస్థ పేర్కొంది. వ‌చ్చే వారంలో క‌రోరా వైర‌స్ టెస్టింగ్ కిట్‌ల‌ను పూర్తి స్థాయిలో అందుబాట‌లోకి తీసుకురానున్న‌ట్టు అమెరికా ఆహార‌, డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ప్ర‌క‌టిచింది.